Temple-Mosque disputes: మందిర్-మసీద్ వివాదాలపై ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పలు మసీదుల విషయం వివాదాస్పదం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంభాల్ షాహీ జామా మసీదు వివాదం, అజ్మీర్ దర్గా వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దేవాలయాలను కూల్చి మసీదులు నిర్మించారని ఆరోపిస్తూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, కొత్త దేవాలయాలు-మసీదు వ్యాజ్యాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ప్రస్తుత కాలంలో మందిర్-మసీద్ వివాదాలు భారీగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను బయటకు తీసి తాము కూడా హిందూ నాయకులం కావొచ్చని కొందరు అనుకుంటున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు.