ఇళయరాజా తమిళ చిత్ర పరిశ్రమలో కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కూడా సంగీత దిగ్గజం. తరచూ వివాదాస్పదంగా మాట్లాడుతూ ఆయన వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇళయరాజాకి జరిగిన ఓ సంఘటన ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆండాళ్ ఆలయ గర్భగుడిలోకి వెళ్లకుండా సంగీత స్వరకర్త ఇళయరాజా ఆపి గర్భగుడి బయట నిలబెట్టిన ఘటన జనాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళనాడు ప్రభుత్వ చిహ్నమైన రాజ గోపురం ఉన్న…
Yadadri Temple: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు భక్తులకు షాకిచ్చారు. ఇక నుంచి ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.
ACB Rides In Vemula Wada Temple: వేములవాడ రాజన్న ఆలయంలో పలు శాఖలలో ఆలయ అధికారుల అవినీతి ఆరోపణ నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు జరిగాయి. తాజాగా అంతర్గత బదిలీలు చేపట్టారు ఆలయ ఈవో వినోద్ రెడ్డి. ఈ నేపథ్యంలో 20 మంది ఆలయ అధికారుల అంతర్గత బదిలీలు జరిగాయి. ప్రధానంగా సరుకుల నిలువలలో వ్యత్యాసం రాగా గోదాం పర్యవేక్షకుడు నరసయ్యను బాధ్యతల నుంచి తప్పించారు. కళ్యాణ కట్ట లోను భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న…
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ సన్నిధి ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. ఏ ఉత్సవాలు జరిగినా.. ఏదో ఒక అలజడి, వివాదం రేగుతూనే వుంటుంది. ఇంద్రకీలాద్రి పై మళ్లీ చీరాల గోల్ మాల్ వ్యవహారం తెరపైకి వచ్చింది. గత ఏడాది కనిపించకుండా పోయిన అమ్మవారి చీరాల లెక్కలు చెప్పాలంటూ రాష్ట్ర ఆడిట్ అధికారులు అడగడంతో ఇంద్రకీలాద్రి అధికారులు ఈ వ్యవహారం కాస్త బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. గత ఏడాది కూడా కనిపించకుండా పోయిన చీరాల…
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఈవోకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తమకు డబ్బులు ఇవ్వాలని లేదంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ద్వారకా తిరుమల ఈవో సుబ్బారెడ్డి అన్నారు. అపరిచిత వ్యక్తులు తనను బెదిరిస్తూన్నారంటూ ద్వారకాతిరుమల దేవస్థానం ఈవో సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ”నీకు ఈవో పోస్టింగ్ రావడానికి తామే కారణం …మాకు 10 లక్షలు ఇవ్వాల”ని డిమాండ్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయవాడకు చెందిన నలుగురు వ్యక్తులు డబ్బులు ఇవ్వకపోతే చంపుతామంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు…