Vemulawada: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో జరుగుతున్న విస్తరణ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆలయ విస్తరణలో భాగంగా చెన్నై నుంచి తెప్పించిన భారీ యంత్రంతో ఫైల్ పుట్టింగ్ విధానంలో పనులు ప్రారంభించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు ఎదురవడంతో అధికారులు వీటిని నిలిపివేశారు. ఆలయ దక్షిణ రహదారితో పాటు పరిసర ప్రాంతాల్లో పిల్లర్ల కోసం రంధ్రాలు వేసిన సిబ్బందికి అనుకున్న ఫలితం రాలేదు. కొన్నిచోట్ల కేవలం 5…