తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సమ్మె సెగ తగిలింది.టాలీవుడ్ కు చెందిన 24 కార్మిక సంఘాలు తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ షూటింగ్స్ ను బంద్ చేయాలని నిర్ణయించాయి. రోజు వేతనాలను కనీసం 30 శాతం మేర పెంచాలని కోరుతూ ఫిలిం ఛాంబర్‌తో చర్చలు జరిపారు. అయితే, ఈ చర్చలు అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవడంతో నిరసనగా షూటింగ్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ బంద్ సినిమా షూటింగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం దాదాపు అన్ని షూటింగులు…