దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ సార్వత్రిక ఎన్నికలలో 21 రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు 1625 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలోకి దిగారు. వీరిలో 252 మంది అభ్యర్థులు నేరచరితులు అంటే వారిపై క్రిమినల్ కేసు నమోదైంది.
నేటి నుండి భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానము నందు శ్రీరామనవమి వసంతపక్ష తిరు కళ్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. నేటి నుండి ఈ నెల 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉదయం అంతరాలయంలోని ధ్రువమూర్తుల వద్ద ఉత్సవాలకు అనుజ్ఞ తీసుకొని ధ్వజారోహణం చేయనున్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో చెన్నై గెలుపొందింది. 17.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చెన్నై బ్యాటింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ (67), శివం దూబె (28), డారిల్ మిచెల్ (25), రచిన్ రవీంద్ర (15) పరుగులు చేశారు. చివరలో ధోనీ వచ్చి అభిమానులకు సంతోషం అందించారు. చెన్నై గెలుపుతో మూడో విజయాన్ని నమోదు…
రాజస్థాన్ లోని కోటాలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఘటన కలకలం రేపుతుంది. మహారావ్ భీమ్ సింగ్ ఆసుపత్రిలో పని చేసే 32 ఏళ్ల కాంట్రాక్టు ఉద్యోగి మృతదేహం వైద్య సదుపాయంలోని టాయిలెట్లో అనుమానాస్పద స్థితిలో కనిపించింది. కాగా.. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని నయాపురా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వ్యక్తి మృతికి గల…
ఏడాదిన్నరగా నమ్మకంగా పని చేస్తున్న కారు డ్రైవర్ యజమానిని బురిడీ కొట్టించి 40 లక్షల నగదు, కారుతో పరారయ్యాడు. పెళ్లి చేసుకొని కొట్టేసిన నగదుతో బిజినెస్ చేసి సెటిల్ అవుదాం అనుకున్నాడు. ఇటీవలే నిశ్చితార్థం చేసుకొని , మరి కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా పోలీసులకు చిక్కాడు. పెళ్లి పీటలు ఎక్కబోయే ఆ డ్రైవర్ ను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసుకు సంబంధించి… పోలీస్ స్టేషన్…
అయోధ్యలో రామజన్మోత్సవం శోభ సంతరించుకుంది. 500 ఏళ్ల తర్వాత రామమందిరంలో రాంలల్లా జయంతి వేడుకలు జరగబోతున్నాయి. అందువల్ల ఈసారి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. మంగళవారం నుంచి అయోధ్య రామ నవమి ఆనందోత్సాహాలలో మునిగిపోనుంది. రామ్‌నగరిలోని ఎనిమిది వేల మఠాలు, దేవాలయాలలో అభినందన పాటలు మరియు వివిధ ఆచారాలు ప్రారంభంకానున్నాయి. రామాలయం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారనుంది. రామ్ జన్మోత్సవ్ శుభ సమయంలో.. రామ్ లల్లా చైత్ర ప్రతిపాద నుండి రామ నవమి వరకు ఖాదీతో చేసిన ప్రత్యేక దుస్తులను…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. చెన్నై ముందు 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో కోల్‌కతా బ్యాటర్లు చేతులెత్తేశారు.
నిరుద్యోగ యువతకు రాహుల్ గాంధీ హామీ.. కొత్త చట్టం తీసుకొస్తాం..! ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల మహిళల ఖాతాల్లోకి ఏటా లక్ష రూపాయలను జమ చేస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. ఇదిలా…
పాకిస్థాన్ ప్రధానమంత్రిగా కొత్తగా ఎన్నికైన షాబాజ్ షరీఫ్.. తన మొదటి విదేశీ పర్యటనకు వెళ్లారు. నవాజ్, ఇమ్రాన్‌ల బాటలోనే తొలి విదేశీ పర్యటనకు సౌదీ అరేబియాను ఎంచుకున్నాడు. అయితే.. కశ్మీర్ సమస్యకు సంబంధించి సౌదీ అరేబియా షాబాజ్‌కి భారీ షాకిచ్చింది. కశ్మీర్ అంశం భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సమస్య అని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. న్యూఢిల్లీతో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ పాకిస్థాన్ ప్రధానికి సూచించారు.
మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ మధ్యాహ్నం 2.30 గంటలకు కేసును విచారించనున్నారు. ఏప్రిల్ 3న ఈడీ.. కేజ్రీవాల్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసులో తన నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు.