గవర్నర్ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, బిల్లులు, పెండింగ్ ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్‌తో సీఎం రేవంత్ చర్చ జరిపారు. జులై మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించినట్లు తెలిసింది. మరోవైపు కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బిల్లుల కోసమే గవర్నర్‌తో సీఎం సమావేశమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మాది మాటల ప్రభుత్వం కాదు……
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు కోసం హైకోర్టుకు వెళ్లిన మాజీ సీఎం కేసీఆర్ కు చుక్కెదురైంది. అయితే.. హైకోర్టు పిటిషన్ ను కొట్టివేయడం కేసీఆర్ కు చెంప పెట్టులాందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రశేఖర్ రావు వాస్తవాలను దాచి పెట్టాలనుకునే ప్రయత్నం చేశారని, చట్టం ముందు అందరూ సమానమే అన్న విషయాన్ని కేసీఆర్ మరిచిపోయారన్నారు ఆది శ్రీనివాస్. రాజ్యాంగబద్దంగా ఏర్పాటు చేసిన కమిషన్‌ను రద్దు చేయాలనే సాహసం చేశాడని, చంద్రశేఖర్…
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టారని, కార్పొరేట్ హాస్పిటల్ లను ప్రోత్సహిస్తున్నాడని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ హాస్పిటల్ లోకి మీడియా ను కూడా అనుమతి ఇవ్వడం లేదు… ఇదేనా మీ ప్రజా పాలన అని ఆయన ప్రశ్నించారు. గ్రూప్స్ నోటిఫికేషన్ల తేదీలను మీ మేనిఫెస్టో లో పెట్టీ అమలు చేయడం లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే చావు డప్పు కొట్టాలని…
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హల్లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మాజీమంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్మన్ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ , ఎమ్మెల్సీ రమణ, 18 మండలల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జగిత్యాలలో ఈ హౌలే గాన్ని ఎమ్మెల్యేను చేసింది ఎవరు..? జగిత్యాలను జిల్లా…
నీట్ కౌన్సిలింగ్‌కి వ్యతిరేకంగా ఈ నెల 6వ తేదీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కి పిలుపునిస్తాము ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తెలిపారు. రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థి, యువజన సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ పరీక్షను రద్దు చేసిన మళ్లీ నిర్వహించాలని, NTA ను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి , యువజన ఐక్య కమిటీ అధ్వర్యంలో గవర్నర్ అప్పోయింట్మెంట్ కోరడం జరిగింది. గవర్నర్ అప్పోయింట్మెంట్ ఇవ్వకపోవడం తో…
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు మొత్తం 14 గేట్లను సోమవారం తెరిచారు. గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు నుంచి మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల సమక్షంలో నీటిని విడుదల చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు.
తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆధార్ కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే దీన్ని మరింత సులభతరం చేసేందుకు ఆర్టీసీ మరో ఆలోచన చేస్తోంది.
సాధారణంగా తన భర్త తనను మోసం చేసి మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడనే ఫిర్యాదులు ఎన్నో చూశాం. ప్రియురాలి మోజులో మోసం చేశాడనే ఫిర్యాదులు కూడా చూశాం. కానీ రెండు సార్లు పెళ్లయిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు దగ్గరుండి వివాహం జరిపించారు. శుభలేఖలు అచ్చువేయించి ఊరందరికీ విందు భోజనాలు పెట్టి భర్తకు మరో వివాహం చేశారు ఇద్దరు భార్యలు. ఈ విచిత్రమైన ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది.