కామారెడ్డి నియోజకవర్గంపై బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. మొదటిసారిగా కామారెడ్డి నియోజకవర్గ నేతలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. కామారెడ్డి జిల్లా జనగామకు చెందిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు.
ప్రపంచకప్ 2023లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్- నెదర్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ముందు నెదర్లాండ్స్ స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లలో నెదర్లాండ్ 229 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు 230 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా టాస్ గెలిచిన నెదర్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో కూడా కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (68) పరుగులతో రాణించాడు.
తెలంగాణలో ఎన్నికల వేళ ఆయా పార్టీలు బరిలోకి దించే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. దీంతో.. మునుగోడు కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. breaking news, latest news, telugu news, munugodu congress, Telangana Elections 2023
2023 వరల్డ్ కప్ లో టీమిండియా దూసుకుపోతుంది. ఆడిన 5 మ్యాచ్ ల్లో అన్నింటిలో గెలిచి విజయకేతనం ఎగురవేసింది. ఇక తర్వాతి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ తో తలపడనుంది. రేపు(ఆదివారం) లక్నోలో ఈ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. రేపటి మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. లక్నోలో స్పిన్ కు ఎక్కువగా అనుకూలిస్తుంది కావున.. అతని స్థానంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకురానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) దాని సభ్యులందరికీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఇస్తుంది. దీని సహాయంతో ఎవరైనా తమ పీఎఫ్ ఫండ్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని చెక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఎవరైనా పీఎఫ్ డబ్బులను కూడా తీసుకోవచ్చు.
డేవిడ్ వార్నర్ లైవ్ మ్యాచ్‌లో పుష్ప పాటకు స్టెప్పులేశాడు. ప్రపంచ కప్ 2023లో భాగంగా.. ఈరోజు ధర్మశాలలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో వార్నర్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పుష్ప స్టెప్పులు వేసి అభిమానులను సంతోషపరిచాడు. వార్నర్ డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీకే మా మద్దతు పలుకుతామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో మాదిగల విశ్వరూప మహా సభలో మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో వెనుకబడిన తరగతి (బీసీ) నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన బీజేపీపై అధికార బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు కేంద్రం ఇంకా అంగీకరించలేదని పేర్కొన్నారు. 'మీట్ ది ప్రెస్' కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెనుకబడిన తరగతులకు చెందిన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని భర్తీ చేయాలని సూచించారు. breaking news, latest news, telugu news, big…
ప్రపంచకప్ 2023లో టీమిండియా సారథి రోహిత్ శర్మ మంచి ప్రదర్శన కనిపిస్తున్నాడు. టోర్నీలో ఓ సెంచరీ నమోదు చేయగా.. మిగిలిన మ్యాచ్ ల్లోనూ దూకుడుగా ఆడి.. జట్టు విజయానికి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే తర్వాత జరిగే ఇంగ్లండ్ మ్యాచ్‌తో రోహిత్ శర్మ రికార్డులు బద్దలు కొట్టనున్నాడు. అయితే ఒకటి, రెండు కాదు.. మూడు రికార్డులను బద్దలు కొట్టేందుకు బరిలోకి దిగనున్నాడు.