గ్లామరస్ హీరోయిన్‌గా పేరొందిన రెజీనా కసాండ్రా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, ఎదురైన సవాళ్లు, పరిశ్రమలో నెలకొన్న వాస్తవాలు గురించి బహిరంగంగా మాట్లాడారు. ‘ఇండస్ట్రీలో ఇప్పుడు టాలెంట్ కన్నా పీఆర్, సోషల్ మీడియా మీదే అవకాశాలు ఆధారపడి ఉంటున్నాయి’ అని ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ‘ నాకు ఎలాంటి ఫిలిం బ్యాగ్రౌండ్ లేదు. ఇండస్ట్రీలో చాలా కష్టపడి ఎదిగాను. సినిమాల్లోకి వచ్చిన మొదట్లో సెట్‌కు వెళ్లడం, నటించడం, వచ్చేయడం.. ఇంతే…