ఏపీఎంసీ ఛైర్మన్‌గా కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును సింగపూర్ దేశం ప్రతిపాదించగా భూటాన్ దేశం మద్దతుతో ఆయా దేశాల ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంటే 40 సభ్య దేశాల ప్రతినిధులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి కే.కేశవరావు ని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ(ఆర్గ్. ఇన్చార్జి) కేసీ వేణుగోపాల్ , తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపదాస్ మున్షీ , తదితరులు పాల్గొన్నారు. కేశవ రావుకు ఇంకా రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకునే అవకాశాలు ఉన్నాయని వర్గాలు తెలిపాయి. ఆయన వైదొలిగితే, కాంగ్రెస్…