మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు పెద్దను కాదని, తాను కూడా సినీ పరిశ్రమలో ఒకడినేనని చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయినా సరే, సినీ పరిశ్రమలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్య ఆయన ఇంటిని వెతుక్కుంటూ వెళుతుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమలో వేతనాలు పెంచాలని ఫెడరేషన్ మొదలుపెట్టిన సమ్మె మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. సుమారు రెండు వారాల నుంచి కొనసాగుతున్న సమ్మెకు ఒక బ్రేక్ వేసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు.…
సినీ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరుకుంది. కార్మిక సంఘాల పెంపుపై అటు ఫెడరేషన్ నాయకులకు ఇటు నిర్మాతలకు మధ్య ఇటీవల జరిగిన చర్చలు ఫలించలేదు. దాంతో సమ్మె కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ చర్చలు త్వరగా ముంగిచాలని భావిస్తున్నారు నిర్మాతలు. ఈ నేపధ్యంలో ఈ రోజు ఉదయం 10గంటలకు ఇందిరా నగర్ లో సినీ కార్మిక సంఘాల సర్వసభ్య సమావేశం కాబోతున్నారు. సర్వసభ్య సమావేశం అనతరం సమస్యలు పరిష్కరించబడాలని సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి…
కార్మిక సంఘాల సమ్మెతో టాలీవుడ్ స్తంభించింది. ఈ బంద్ పై కొందరు తెలుగు చలన చిత్ర నిర్మాతలు ఇన్ సైడ్ గా మాట్లాడుతూ ’50 ఏళ్ల కిందటి యూనియన్ రూల్స్ తో నేటి పరిస్థితుల్లో నిర్మాతలు సినిమాలు తీయలేరు, వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో ఈ సమ్మెకు ముగింపు పలికేందుకు నిర్మాతలు సాధ్యమైనంతగా స్పందిస్తున్నారు. ఇతర చిత్ర పరిశ్రమల్లో ఉన్నట్లే టాలీవుడ్ లోనూ సినీ కార్మికుల పని గంటలు ఉండాలని నిర్మాతలు కోరుతున్నారు.…
రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు డైరెక్షన్లో రూపొందిన కూలీ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజే 150 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మొదటి నాలుగు రోజులకు గానూ 404 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమాలకు రికార్డు క్రియేటర్ రజనీకాంత్‌ని, వాటిని బ్రేక్ చేసే రికార్డు బ్రేకర్ కూడా ఆయనే అని చెప్పుకొచ్చింది.…
Tollywood: టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. షూటింగ్స్ పూర్తిగా ఆగిపోవడంతో సగటు కార్మికులు విలవిలలాడుతున్నారు. నిర్మాతలతో చర్చలు ఫలితమివ్వకపోవడంతో ఫెడరేషన్ నాయకులు ఒక పక్క చర్చలు కొనసాగిస్తూనే మరోపక్క నిరసనలకు దిగుతున్నారు. ఈ సమస్యల నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్ నాయకులు మెగాస్టార్ చిరంజీవిని కలవనున్నారు. అంతకు ముందు మధ్యాహ్నం 11 గంటలకు ఫెడరేషన్ కార్యాలయంలో కార్మిక సంఘాల సమావేశం జరగనుంది. నిన్న నిర్మాత సీ.కళ్యాణ్ కార్మిక సంఘాల సమస్యలపై…
Nagarjuna : నాగార్జున ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నాడు. కుబేర, కూలీ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఆయన పాత్రలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే ఆయన జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్ గా వచ్చారు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నాడు. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు నా పేరు కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. అప్పుడు నాగేశ్వర రావు కొడుకు అనే అన్నారు. నా మొదటి సినిమా చూసిన…
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీలకు ఉండే బజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు రిలీజ్ కు ముందే కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేసుకుంటాయి. అయితే ఆయన సినిమాపై నిర్మాత అనిల్ సుంకర తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. మహేశ్ బాబుతో నేను వన్ నేనొక్కడినే సినిమాను నిర్మించాను. ఆ మూవీ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉండేది. ట్రైలర్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేయకుండా…
ట్యాలెంటెడ్ హీరో డాలీ ధనంజయ, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో సుకేష్ నాయక్ దర్శకత్వంలో యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ సమర్పణలో కళ్యాణ్ చక్రవర్తి ధూళిపల్ల నిర్మిస్తున్న హిస్టారికల్ ప్రాజెక్ట్ ‘హలగలి’. ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తోంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో చిత్రీకరిస్తున్నారు. గ్రాండ్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సినిమా గ్లింప్స్ ని లాంచ్ చేశారు మేకర్స్. ధనంజయ్‌ను కమాండింగ్ అవతార్ ప్రజెంట్ చేసిన గ్లింప్స్ గ్రేట్ ఇంపాక్ట్ క్రియేట్…
ప్రముఖ నిర్మాత, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఒక కొత్త రియాల్టీ షోకు శ్రీకారం చుట్టారు. సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రియాల్టీ షో ద్వారా కల్పించనున్నారు. మొత్తం 16 సినిమా స్క్రిప్ట్స్, ఆ స్క్రిప్ట్ ను పరిశీలించడానికి 12 మంది జడ్జీలు, సినిమాకు స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడం నుంచి ఆర్టిస్టులు, రచయితలు ఇలా 24 విభాగాల్లో పని చేసే టెక్నీషియన్లను మొత్తం 75 రోజుల్లో ఎన్నుకునే విధానాన్ని…
తెలుగు సినిమా పాన్ ఇండియాను దాటిపోయింది. పెద్ద సినిమా అంటే ఇక నుంచి పాన్ ఇంటర్నేషన్ మూవీనే. నిన్నటివరకు పాన్ ఇండియా మూవీ కోసం.. హిందీ.. కన్నడ.. తమిళం.. మలయాళం నుంచి నటీనటులను దిగుమతి చేసుకున్నారు. ట్రెండ్ మారింది. ఇక నుంచి హాలీవుడ్ స్టార్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. పూరీ జగన్నాథ్ లైగర్ కోసం ఏరికోరి మైక్ టైసన్‌ను తీసుకొచ్చాడు పూరీ. పెద్దగా ఇంపార్టెంట్ లేని రోల్‌ను టైసన్‌కు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సినిమా ఫ్లాప్ కావడంతో…