Amaravati Avakaya Utsav: విజయవాడలోని పున్నమి ఘాట్‌లో రెండో రోజు ఆవకాయ అమరావతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సినిమా, సంస్కృతి, సాహిత్యాల సమ్మేళనంగా కొనసాగిన ఈ ఉత్సవాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణానది తీరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవ వాతావరణాన్ని మరింత సొగసుగా మార్చాయి. సంగీతం, నృత్య ప్రదర్శనలతో పాటు సినీ సాహిత్యంపై జరిగిన చర్చలు మంచి స్పందన పొందాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు పున్నమి ఘాట్‌ను కళా, సాంస్కృతిక వేదికగా…
Amaravati Avakaya Festival 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతి, చరిత్రను చాటి చెప్పేలా అమరావతి-ఆవకాయ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.. ఆవకాయ అనగానే ప్రపంచవ్యాప్తంగా గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్. అలాంటి ఘనమైన ఆంధ్ర వంటక వైభవాన్ని, అమరావతి సంస్కృతిని, తెలుగు సినీ చరిత్ర ఔన్నత్యాన్ని ఒకే వేదికపై చాటిచెప్పేలా అమరావతి–ఆవకాయ ఫెస్టివల్ 2026 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. విజయవాడ వేదికగా నిర్వహించిన ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించారు..…