దేశీయ స్టాక్ మార్కెట్‌లో లాభాల జోరు కొనసాగుతోంది. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మార్కెట్‌కు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 361 పాయింట్లు లాభపడి 81, 921 దగ్గర ముగియగా.. నిఫ్టీ 104 పాయింట్లు లాభపడి 25, 041 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.97 దగ్గర ముగిసింది.