రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సంక్రాంతి పండుగ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది కోడి పందేలు. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో పందేలు కాయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు. అయితే పందేల సమయంలో చాలా కోళ్లు అపహరణకు గురవుతాయి. తాజాగా ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లా తేలప్రోలులో చోటుచేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 15 కోళ్లను దొంగలు ఎత్తుకెళ్లారు. కృష్ణా జిల్లా తేలప్రోలులో ఆదివారం…