రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు నేటితో(ఆదివారం)ముగియనున్నాయి. వజ్రోత్సవాల్లో భాగంగా తొలిరోజైన శుక్రవారం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ పతాకాలతో ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపుతో.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారివారి నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా.. అమరవీరుల స్థూపాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరులను స్మరించుకున్నారు. తెలంగాణలో…
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన బిడ్డలు ఎస్టీలు.. మహారాష్ట్రలో బీసీలు. ఇంకో చోట ఓసీలు కూడా ఉన్నారు.. ఇలా రకరకాలుగా విభజనలో ఉన్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఉండే గిరిజన బిడ్డలందరికీ సమాన హోదా వచ్చే కార్యక్రమానికి జాతీయ స్థాయిలో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హైదారబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లో నూతనంగా నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఇవాళ బంజారాహిల్స్‌లో ఇంత చక్కటి…
సెప్టెంబర్ 17వ తేదీకి తెలంగాణలో ఓ ప్రత్యేక స్థానం ఉంది.. ఓ చరిత్ర ఉంది.. ఎంతో మంది త్యాగాలున్నాయి… ఆ సందర్భాన్ని పురస్కరించుకుని.. తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నిత్య చైతన్య దీప్తి తెలంగాణ.. చైతన్యానికి నెలవు, విప్లవాలకు కొలువు అంటూ ప్రశంసలు కురిపించారు.. ప్రపంచంలోనే పేరుగాంచిన సాయుధ పోరాటానికి జన్మనిచ్చిన పురిటి గడ్డ తెలంగాణ అని పేర్కొన్న ఆయన.. అటువంటి ఈ…
మీ అందరికీ వినమ్రంగా చేతులు మోడ్చి నమస్కరిస్తూ నేను కోరుకునేది ఒక్కటే.. ఎన్నటికీ ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప, అశాంతి, అలజడులతో అట్టుడికి పోవద్దని సీఎం కేసీఆర్ కోరుకున్నారు. తిరిగి తెలంగాణ మరో కల్లోలంలోకి జారిపోవద్దని అన్నారు. తెలంగాణ ఈనాడు ఎంత వేగంగా పురోగమిస్తున్నదో.. అంతేవేగంతో రాబోయే రోజుల్లోనూ అప్రతిహతంగా అభివృద్ధి పథంలో దూసుకు పోవాలని అన్నారు సీఎం. యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హృదయపూర్వక…
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్లారిటీ ఇచ్చారు.. దీంతో చంద్రబాబు పని ఐపోయింది.. అమరావతి విషయంలో భూ భాగోతం బయట పడిందన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి...
రాష్ట్రం మర్చిపోతే కేంద్రం నిర్వహిస్తుందని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అనేక మంది బలిదానాలు, సర్ధార్ పటేల్ కృషి ఫలితంగా తెలంగాణ దేశంలో విలీనం అయిందని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్ళ తరువాత అధికారికంగా ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత తెలంగాణకు వచ్చిందని బండి సంజయ్ అన్నారు. నిజాం, రజాకార్ల చేతిలో తెలంగాణ ప్రజలు.. హిందువులు చిత్రహింసలకు గురయ్యారని తెలిపారు. తెలంగాణను పాకిస్థాన్ లో కలుపుతా అని, లేదా ఒంటరి…
సెప్టెంబర్ 17పై తెలంగాణలో ఇప్పుడు రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి… కొందరు చరిత్రను అనుగుణంగా మాట్లాడితే.. మరొకరు చరిత్రను వక్రీకరిస్తూ తమకు అనుకూలంగా మార్చుకునేవాళ్లు ఉన్నారు.. తెలంగాణ సాయుధ పోరాటంతో అసలు సంబంధం లేనివాళ్లు కూడా.. దానిని ఐజాక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇంతకీ సెప్టెంబర్ 17న అసలేం జరిగింది.. నిజాం రాజుతో పాటు ఆయన సంస్థానంలోని భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ, ముస్లింలు ఏకమై పోరాటాలు చేసిన ఆ పోరాటం జరిగింది.. భూమి కోసం.. భుక్తి కోసం..…
సెప్టెంబర్ 17పై తెలంగాణలో రాజకీయం రంజుగా జరుగుతోంది. పార్టీలన్నీ వేడుకలను తలో పేరుతో నిర్వహిస్తున్నాయి… విలీనం అని ఒకరు.. విమోచనమని మరొకరు.. విద్రోహమని ఇంకొకరు.. ఇలా పలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.. పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మూడు రోజుల పాటు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. నిన్న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు జరిపారు. తమ తమ నియోజకవర్గాల్లో మంత్రులు కూడా ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ…