తెలంగాణలో కొత్త మద్యం పాలసీని కొలిక్కి తెచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది ఎక్సైజ్ శాఖ. దీపావళి తర్వాత దుకాణాలకు టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా రెండేళ్లకోసారి పాలసీ గడవు ముగుస్తుంది. నిజానికి…ఈ అక్టోబర్‌తో గడువు ముగియాల్సి ఉండగా..డిసెంబర్ వరకు పొడిగించారు. కరోనా లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడినందున పాత లైసెన్స్‌లను పొడిగించాల్సి వచ్చింది. దీంతో డిసెంబరు నుంచి కొత్త పాలసీ కూడా అమల్లోకి రానుంది. ఇక…కొత్త పాలసీ విధివిధానాలను ఖరారు చేయడంపై ఉన్నతాధికారులు దృష్టి…
టీఆర్ఎస్ చీఫ్.. ఏపీలో పార్టీ పెడతారో లేదో కానీ.. ప్లీనరీలో ఆయన చేసిన ప్రకటన ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అధికార వైసీపీ కౌంటర్లపై కౌంటర్లు వేస్తోంది. రాజకీయ లబ్ధికోసం నేతలు చేస్తున్న ప్రయత్నాలు.. ఈ రగడను అనేక మలుపులు తిప్పుతోంది. మాటల దాడి ఇక్కడితో ఆగుతుందా? మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో పార్టీలు ఉన్నాయా? రెండు రాష్ట్రాలను కలిపేస్తే సమస్యే ఉండబోదన్న పేర్ని నాని..! టీఆర్ఎస్ ప్లీనరీలో గులాబీ బాస్.. సీఎం కేసీఆర్ చేసిన…
దేశవ్యాప్తంగా ఇవాళ 13 రాష్ట్రాల్లో 3 లోక్‌సభ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ నిర్వహిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి, తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.. అయితే, పోలింగ్ విషయంలో రెండు స్థానాల్లో స్పందన మాత్రం ఒకేలా లేదు.. హుజరాబాద్తో పోలిస్తే.. బద్వేల్ మాత్రం బాగా వెనుకబడింది.. ఇక, పోలింగ్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే.. హుజురాబాద్‌లో భారీగా పోలింగ్…
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఎలక్ట్రిక్ బైకుపై నడుపుతున్న ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ‘ఈవీ ట్రేడ్ ఎక్స్పో’ పేరిట జరిగిన విద్యుత్ వాహనాల ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి జగదీష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన ఎలక్ట్రిక్ బైకును నడుపుతూ ట్రయల్స్ వేశారు. వాయు, శబ్ద కాలుష్యాన్ని ఈ-బైక్స్ ద్వారా తగ్గించవచ్చని స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనేవారికి ట్యాక్స్ మినహాయింపులతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్…
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నివాసంలో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి శాంతమ్మ (78) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. శాంతమ్మ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మాతృవియోగం కలిగిన విషయం తెలుసుకున్న పలువురు టీఆర్ఎస్ నేతలు ఆయనకు సంతాపం తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, చిట్టెం మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Read Also:…
తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్‌లోని 262వ నంబర్ పోలింగ్ బూత్‌లో తన భార్య జమునతో కలిసి ఈటెల రాజేందర్ ఓటు వేశారు. అనంతరం పోలింగ్ సరళిని గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ ప్రజలు తమ గుండెల్లోని బాధలను ఓట్ల రూపంలో చూపిస్తున్నారన్నారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే వేల సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడమే దీనికి నిదర్శనమన్నారు.…
ఫ్రెంచ్ సెనేట్‌లో ‘యాంబిషన్ ఇండియా-2021’ బిజినెస్ ఫోరంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గత ఏడేళ్లలో తెలంగాణలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ప్రసంగంలో టీఎస్ ఐపాస్ గురించి కూడా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రమని, తెలంగాణ ప్రభుత్వ టీఎస్ ఐపాస్ పాలసీ పారదర్శకతతో కూడిన స్వీయ ధృవీకరణను అనుమతిస్తుందని కేటీఆర్ చెప్పారు. చట్టం ప్రకారం 15 రోజులలో అన్ని రకాల అనుమతులకు సంబంధించి పూర్తి…
తెలుగు రాష్ట్రాల్లో శనివారం నాడు ఉప ఎన్నికల హడావిడి నెలకొంది. ఏపీలోని బద్వేలు, తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం నాడు ఉప ఎన్నికలు జరగనున్నాయి.ముఖ్యంగా హుజురాబాద్‌లో పోటీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉండనుంది. టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా కాస్ట్లీ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలో గెలుపు ఇరుపార్టీలకు చాలా అవసరం. ప్రజల్లో తమపై వ్యతిరేకత…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా ఉన్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 174 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 202 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,71,174 కు చేరగా.. రికవరీ కేసులు 6,63,124 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య…
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఉద్దేశిస్తూ ‘మంగళవారం మరదలు’ అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను ఒక మహిళ గురించి తప్పుగా మాట్లాడలేదని.. ఏకవచనం వాడలేదని క్లారిటీ ఇచ్చారు. తాను మాట్లాడిన భాషలో ఏదైనా తప్పు ఉంటే చింతిస్తున్నానని వెల్లడించారు. షర్మిల తన కుమార్తె కంటే పెద్దది… సోదరి కంటే చిన్నది. తండ్రి సమకాలీకుడైన సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో ఆమె సంభోదించడం సంస్కారమేనా?’ అని నిరంజన్‌రెడ్డి షర్మిలకు చురకలు అంటించారు.…