తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు త్వరలో నగరంలోని ప్రధాన ప్రదేశాలలో వక్ఫ్ ఆస్తుల అభివృద్ధిని చేపట్టేందుకు తన ప్రణాళికలను ఖరారు చేయనుంది. ప్రైవేట్ సంస్థల సహకారంతో బోర్డు దాని స్థలాల ద్వారా మరింత ఆదాయాన్ని సంపాదించడానికి షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్, ఇతర వాణిజ్య స్థలాల నిర్మాణాన్ని చేపట్టనుంది. దీని ద్వారా వచ్చే ఆదాయంతో మైనార్టీల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపడతామన్నారు. గతంలో దీనిపై ప్రణాళికలను సిద్ధం చేశామని, రానున్న బోర్డు సమావేశంలో మమ్మల్ని సంప్రదించిన కంపెనీలను…