సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో అన్ని సమస్యల పరిష్కారాలపై చర్చించినట్లు తెలిపింది. మంత్రి హామీతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు, మంత్రి హామీతో సమ్మె తాత్కాలికంగా విరమించుకున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. హామీలు నెరవేర్చకపోతే భవిష్యత్ లో సమ్మె తప్పదని హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి సీఎంతో మాట్లాడి దశల వారీగా పరిష్కారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.