ఉమ్మడి మెదక్ జిల్లాలో చేతబడి పేరుతో హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో తోడబుట్టిన వాళ్ళను హత్య చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో రెండు దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. సాంకేతిక యుగంలోనూ మూఢ నమ్మకాలను బలంగా నమ్ముతున్నారు జనం. ఏదైనా రోగం వస్తే మంత్రాలతోనే వచ్చిందని నమ్ముతున్నారు.