Bandi Sanjay Kumar: ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయించడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫీజు బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు, సిబ్బంది ధైర్యంగా పోరాడాలని పిలపునిచ్చారు. 6 గ్యారంటీలు ఇస్తామని ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? మాట తప్పిన కాంగ్రెస్ నేతలపై విజిలెన్స్ దాడులు చేస్తారా?
MLC Kavitha: గ్రూప్-1 విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు చాలా కార్యక్రమాలు చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 15 తారీఖున డివిజన్ బెంచ్ తీర్పుపై విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. గ్రూప్1 నియామకాలపై సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో అనంతరం మీడియాతో మాట్లాడారు. అందుకే 15 వరకు కార్యక్రమాలు తీసుకుందామని నిర్ణయించినట్లు చెప్పారు. నిన్న విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పించి వారి సాక్షిగా పోరాటం ప్రారంభించామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులను…