కిర్గిజిస్తాన్ లోని బిష్‌కెక్‌లో భారతీయ విద్యార్థులపై దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో, విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని మరియు తెలంగాణ విద్యార్థులకు అవసరమైన సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతీయ విద్యార్థులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక విద్యార్థులకు మరియు ఈజిప్టు విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ తరువాత, బిష్కెక్‌లో హింస చెలరేగడంతో భారతీయ విద్యార్థులపై స్థానికులు దాడులకు దారితీసింది. ఈ దాడులకు సంబంధించిన అనేక వీడియోలు…