తెలంగాణలో ఇవాళ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష జరగనుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించబోమని రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు అధికారులు. పరీక్ష ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుంది. ఉదయం పది గంటల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తామని తెలిపారు అధికారులు. పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, వాచీలు, క్యాలిక్యులేటర్ లాంటి ఎలక్ట్రానిక్…