ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ గురువారం భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. తెలంగాణ, పాండిచ్చేరి లోని తాజా పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు. ప్రధానికి పీఎం అండ్ పీఎం, మరో పుస్తకాన్ని గవర్నర్ తమిళ సై అందించారు. కోవిడ్ విపత్కర సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అన్ని విధాలుగా సహకారం అందిందని తమిళ సై తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రం సమర్థవంతంగా అన్ని…