తెలంగాణ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌కు సైబర్ కేటుగాళ్లు కన్నం వేశారు.. బ్యాంక్ ఖాతాల్లోకి ప్రవేశించి దాదాపుగా రూ.2 కోట్లు కాజేశారు.. అయితే, ఈ కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.. బ్యాంక్ మూల ధనం నుంచి రెండు కోట్లు కొట్టివేసిన నైజీరియన్‌ను పట్టుకున్నారు సీసీఎస్ పోలీసులు.. దీంతో అపెక్స్ బ్యాంకులో నగదు మాయం కేసులో అరెస్ట్‌ల సంఖ్య రెండుకు చేరింది.. హైదరాబాద్ టోలిచౌకిలో నివాసముంటున్న నైజీరియన్ లేవి డైలాన్ రోవాన్ ఇవాళ అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు…