Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ దిశగా పయనిస్తూ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ భాగాలపై వ్యాపించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
TS Heavy Rain: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుండగా, అనుబంధ వాయుగుండం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.
TS Red Alert: నైరుతి రుతుపవనాల నేపథ్యంలో ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ శుక్రవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ నిన్న (గురువారం) పేర్కొంది. ఇక జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. నగరంలోనూ పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది. అయితే.. కర్ణాటక,…