తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను అధికారులు శనివారం ప్రకటించారు. డిసెంబర్ 11 నుంచి 26వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్లు టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. డిసెంబర్ 27 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు ఒక్కో పేపర్‌కు రూ.25 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించుకోవచ్చని వెల్లడించారు. Notices…