టీఆర్‌ఎస్ పార్టీ అధినేక కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన తనయుడు, మంత్రి కేటీఆరే అవుతారని ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ నేతలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని టీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు.
తెలంగాణ ప్రజల కోసం నేను ప్రాణం అయినా ఇస్తానన్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. బంగారు తెలంగాణ అయిందా? వెండి తెలంగాణ అయినా అయిందా? అప్పుల తెలంగాణ అయింది. అప్పులు ఎందుకు అయిపోయాయి? నాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వరని పాల్ ప్రశ్నించారు. 8 ఏళ్ళ వరకూ నిరుద్యోగులు గుర్తుకురాలేదా? నాకు సెక్యూరిటీ అడిగినా ఇవ్వలేదు. నేను రాకుంటే ఇంకా దోచుకుంటారా? ఇంకా తెలంగాణను అమ్మేస్తారా? మీకోసం నేను వచ్చా. ఒక్కొక్కరు వందమంది వెయ్యిమందికి చెప్పండి. అన్నివర్గాల…