కీలక సమయంలో ఉపాధ్యాయ సంఘాలను ప్రభుత్వం లైట్ తీసుకుందా? ప్రభుత్వంలోని పెద్దలను కలిసి మాట్లాడుతున్నా.. మార్పు లేదు? ఒకప్పుడు బదిలీలు.. పదోన్నతులు అంటే క్షణం తీరిక లేకుండా గడిపిన టీచర్ల సంఘాల నేతలు.. మౌనంగా ఎందుకున్నారు? ప్రత్యేక రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలు నిర్వీర్యం..! తెలంగాణలో 50కి పైగా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. విద్యాశాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభావం స్పష్టంగా కనిపించేది. ఏదైనా జరుగుతుంది అంటే అందులో తమ ప్రమేయం ఉన్నట్టుగా హడావిడి చేసి ప్రకటనలు…