Group 1 Mains Exam: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ర్యాంకుల విషయంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో గ్రూప్-1 ర్యాంకర్లకు, టీజీపీఎస్సీ (TGPSC)కి భారీ ఊరట లభించింది. ఈ నిర్ణయంతో గ్రూప్-1 నియామకాలకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్-1 ర్యాంకింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై గతంలో విచారణ జరిపిన సింగిల్ బెంచ్, ఈ నెల 9వ తేదీన ర్యాంకులను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.…
మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. అయితే తమ ఐటీఐ కళాశాల తరలించకుండా చర్యలు తీసుకోవాలని సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మకు 132 విద్యార్థుల లేఖ రాసారు. తమ కళాశాలని తరలించి భూమిని కంపెనీలకు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోందని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ విద్యార్థుల లేఖను సుమోటో పిల్ గా స్వీకరించింది సీజే ధర్మాసనం. ఆ ఐటీఐ కళాశాల తరలిస్తే పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బంది పడతారని తెలిపింది హైకోర్టు.…