Kavitha: కరీంనగర్ జిల్లాలో కవిత మొదటి రోజు పర్యటన కొనసాగుతోంది. మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మొంథా తుపాను కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడిగా కొనుగోళ్లు చేయటం లేదు. దానికి తోడు వర్షాల కారణంగా రైతు పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు.
Ponnam Prabhakar: కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.. బస్సులను రోజూ తనిఖీ చేస్తుంటే వేధింపులు అంటున్నారని చెప్పారు.. ఏపీ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని.. త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ల సమావేశం నిర్వహిస్తామన్నారు.
TS Ministers : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉందని.. ప్రజలకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించామని.. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను ఆ…