ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదల తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదల అయింది. సెప్టెంబర్ 29 (సోమవారం)వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ విచారణలు ప్రారంభం కానున్నాయి. అయితే, 29వ తేదీన పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్వకేట్లతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫిర్యాదుదారుల అడ్వకేట్లతో వాదిస్తారు. ఇక, అక్టోబర్ 1వ తేదీన ఫిర్యాదుదారు అడ్వకేట్స్ తో పాటు పార్టీ మారిన లాయర్లతో వాదిస్తారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకి…
Telangana Reservoirs Overflow: తెలంగాణలోని ప్రధాన నది ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్, సింగూరులకు భారీగా వరద వస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో అధికారులు 40 వరద గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి లక్షా 46 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, రెండు లక్షల 55 వేల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది.…
తాజా భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిన నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించారు.
Balakrishna : నందమూరి బాలకృష్ణ మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. తెలంగాణలో వరదలు నిండా ముంచేశాయి. అందులోనూ కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలను అతలాకుతలం చేసేశాయి. కామారెడ్డిలో భారీ విధ్వంసమే జరిగింది. దాంతో టాలీవుడ్ నుంచి ఒక్కొక్కరుగా సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ మంచి మనసు చాటుకున్నాడు. వరదల వల్ల నష్టపోయిన వారి కోసం తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఆయన వరల్డ్ బుక్ ఆఫ్…
Telangana Floods : డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మంచి మనసు చాటుకున్నాడు. తెలంగాణలో వరదలు భారీగా నష్టం చేశాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో విధ్వంసం జరిగింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముందుకొచ్చారు. తన భద్రకాళి ప్రొడక్షన్స్ తరఫున సీఎం సహాయనిధికి రూ. 10 లక్షల విరాళాన్ని అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా ఈ రోజు చెక్ ను అందించారు. ఇక్కడి…
కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడడమే తమ ప్రధాన బాధ్యత అని తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ శాఖా డీజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు.
నిన్నటి నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు జంట జలాశయాలను నిండుకుండలా మార్చాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా చేరుతోంది.
Bandi Sanjay : తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురుస్తున్న అతిభారీ వర్షాలతో రెండు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట వద్ద మానేరు వాగులో ఐదుగురు పశువుల కాపర్లు చిక్కుకున్నారు. దాంతో పాటు కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కలిపి 30 మంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కుమార్ చొరవ చూపించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు…