Telangana Reservoirs Overflow: రాష్ట్రవ్యాప్తంగా నిండుకుండలా జలాశయాలు..
- ఎగువ ప్రాంతాల వర్షాలతో తెలంగాణ ప్రధాన ప్రాజెక్టులు నిండుకుండలా..
- శ్రీరాంసాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్, సింగూరు వరదతో కిటకిట
- గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Reservoirs Overflow: తెలంగాణలోని ప్రధాన నది ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్, సింగూరులకు భారీగా వరద వస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో అధికారులు 40 వరద గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి లక్షా 46 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, రెండు లక్షల 55 వేల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1089 అడుగులకు చేరింది. మొత్తం నీటి సామర్థ్యం 80 టీఎంసీలు ఉండగా, ఇప్పుడు 75 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
కొత్త ‘Nothing Ear (Open)’ TWS ఇయర్‌బడ్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!
Also Read
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
- Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
- Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
ఇక కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోని 10 గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 70,787 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 78,446 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 1403 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 17 టీఎంసీలు ఉండగా, ఇప్పుడు 15 టీఎంసీల నీరు ఉంది.
నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 16 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర, 10 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3 లక్షల 57 వేల 333 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 586.70 అడుగుల వద్ద ఉంది. మొత్తం నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ఇప్పుడు 304 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Meerut: ఉద్యోగం పేరుతో హోటల్ కు పిలిచి.. అత్యాచారం.. ఆపై బ్లాక్ మెయిల్..
ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతోంది. అధికారులు 7 స్పిల్‌వే గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 58,696 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 58,892 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 16.607 టీఎంసీలు నిల్వ ఉంది.
తాజావార్తలు
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?