Kadam Project: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈక్రమంలో కడెం పరివాహక ప్రాంతానికి భారీగా వరద నీరు చేరింది. దీంతో బుధవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లు కిందికి వదిలే అవకాశం ఉందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాథోడ్ విట్టల్ తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 20.138 క్యూసెక్కులు ఔట్ ఫ్లో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు, మొదలైన జీవాలు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు.…
Heavy Rain Paralyzes Hyderabad: హైదరాబాద్‌ను వర్షం ముంచేసింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. సిటీలోని అన్ని ప్రాంతాల్లో వర్షం భారీ వర్షం పడింది. రోడ్లపైకి వరదనీరు చేరడంతో సిటీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయ్యింది. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మూసాపేట, అమీర్‌పేట, పంజాగుట్ట, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీ నగర్ మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అత్యధికంగా గచ్చిబౌలిలో 12.5 సెం.మీ. వర్షపాతం.. ఖాజాగూడలో 12, ఎస్‌ఆర్ నగర్‌లో 11,…