వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, ఈఓ పురేందర్ అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ దేవాదాయశాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. హైదరాబాద్ బొగ్గులకుంటలో జరిగిన ఈ ఆందోళనకు కొత్తకోట ఆశ్రమ అర్చకుడు శివానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శక్తిపీఠాలలో ఒక పీఠం అయిన అలంపూర్ జోగులాంబ ఆలయ పవిత్రతను కాపాడాలన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ పై క్రిమినల్…