కాచిగూడ లింగంపల్లి రాఘవేంద్ర స్వామి ఆలయంలో పూజ నిర్వహించిన అనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి అంబర్ పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ కాలేర్ వెంకటేష్ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
దుబ్బాకలో మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరికి హాని చేయడని ఆయన అన్నారు. కొంత మంది ఓ వ్యక్తిని రెచ్చగొట్టి, బాగా తాగించి కత్తితో దాడి చేయించారని ఆయన ఆరోపించారు. గంట లేట్ అయితే ప్రభాకర్ రెడ్డి ప్రాణానికే ప్రమాదం ఉండేదన్నారు.
Minister KTR: నాకు రాజకీయ భిక్ష పెట్టిన నియోజకవర్గం సిరిసిల్ల జిల్లా. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ సిరిసిల్ల ప్రజల ఆశీస్సులతో సిరిసిల్లను నేను గెలిచి అభివృద్ధి చేశాను.
తెలంగాణలో శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.