తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు కోరారు. శనివారం నాడు న్యూఢిల్లీలోని అశోకా హోటల్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ‘ప్రి-బడ్జెట్’ సమావేశంలో ఆయన పాల్గొని తెలంగాణ ప్రభుత్వ విన్నపాలను కేంద్రం ముందుంచారు. 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని,…