తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హీట్ పుట్టించిన జగ్గారెడ్డి ఇష్యూ చల్లబడినట్టే అనిపించింది.. అయితే, జగ్గారెడ్డి పదవులకు కోత విధిస్తూ తెలంగాణ పీసీసీ తీసుకున్న నిర్ణయంతో.. మరోసారి పార్టీలో కాక రాజేసినట్టు అయ్యింది.. ఇక, ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మరోవైపు పీసీసీ చర్యపై మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నారు జగ్గారెడ్డి.. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ప్రతినిధులు ఓసారి జగ్గారెడ్డిని ప్రశ్నించారు.. ప్రస్తుతం నాతో భట్టి, ఉత్తమ్ సహా ఎవరూ మాట్లాడట్లేదన్న ఆయన..…
తెలంగాణలో వరిధాన్యం సమస్య వెనుక బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర వుందని మండిపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ మంత్రులు కొత్త డ్రామా ఆడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వైపు జనం చూస్తున్నారు కాబట్టి బీజేపీ-టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయన్నారు. వరి ధాన్యం కొనుగోలు వెనుక బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ కుట్ర వుందని ఆరోపించారు జగ్గారెడ్డి. సీఎం కేసీఆర్ ఢిల్లీకి పోతేనే సమస్య పరిష్కారం కాలేదు. మంత్రులవల్ల ఏం అవుతుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాని…
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అంతా జట్టు కట్టారా? రేవంత్ మీద నుంచి టార్గెట్ మళ్లించారా.. లేక వ్యూహాత్మక ఎత్తుగడ ఎంచుకున్నారా? వరస భేటీల వెనక వ్యూహం ఏంటి? వారి తాజా లక్ష్యం ఎవరు? ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌పై సీనియర్ల గురి..! ఒకరికొకరు చెక్ పెట్టుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారే దిట్ట. ఏదైనా తమ దారిలోకి రావాలని అనుకుంటారు తప్పితే.. అంతా ఒకేదారిలో నడిచే ప్రసక్తే లేదన్నట్టుగా ఉంటుంది నేతల వ్యవహార శైలి. ఒకరు యస్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరో పోరుకు రెడీ అయింది. తెలంగాణలోని విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి నేడు శ్రీకారం చుట్టబోతుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని రాజీవ్ చౌరస్తా నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం 65 రోజుల పాటు సాగనుంది. విద్యార్థి- నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో డిసెంబర్ 9 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ, ఆదివాసీ విద్యార్థులందరికీ… కార్పొరేట్…
తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. పార్టీలో రేవంత్‌కు సీనియర్లకు అస్సలు పడటం లేదు. ఎవరి గోల వారిదేనా? రాహుల్‌ను విమర్శించినా పార్టీ నేతల నుంచి స్పందన లేదా? నేతల మధ్య స్పష్టమైన విభజన వచ్చేసిందా? రేవంత్ వర్గం తప్ప ఇంకెవరూ మాట్లాడం లేదా? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట మీదకు రావాలంటే బ్రహ్మాండం బద్ధలవ్వాలనే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఒకప్పుడు పీసీసీ చీఫ్‌గా ఎవరు ఉన్నా.. ఆయనతో తమకు పడకపోయినా.. సోనియా, రాహుల్ గాంధీలను…
తెలంగాణ పొలిటికల్ హీట్ ఇప్పుడు హస్తిన తాకింది.. తన పాదయాత్రకు ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్లి వస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు హస్తినబాట పట్టారు.. కొత్త పీసీసీ చీఫ్‌ను.. కొత్త కమిటీలను ప్రకటించిన తర్వాత తొలిసారి అందరితో సమావేశం అయ్యేందుకు సిద్ధం అయ్యారు రాహుల్ గాంధీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీతో టి.కాంగ్రెస్ నేతలు భేటీ…
తెలంగాణ కాంగ్రెస్ కు మూలస్తంభాలుగా ఉన్న నేతల్లో.. జానారెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుత టీ కాంగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంత కాదనుకున్నా.. వీళ్లందరినీ కలుపుకొని వెళ్తే తప్ప.. పార్టీని ముందుకు తీసుకువెళ్లలేరు. వీళ్లు మాత్రమే కాదు.. రెండో వరసలో.. షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్ వంటి నేతలను కూడా రేవంత్ సమన్వయం చేసుకోవాల్సిందే. లేదంటే..…
మాట మీరినా.. మాట తూలినా.. మటాషే. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ ట్రెండే నడుస్తోంది. పీసీసీకి కొత్తచీఫ్ వచ్చాక క్రమశిక్షణ కమిటీ కఠినంగా ఉంటోంది. కాకపోతే ఇప్పటివరకు వేటు పడ్డవారి గురించే చర్చ. వారంతా ఓ నేత వర్గమట. అందుకే వేటు వెనక కథేంటని చర్చించుకుంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. కొత్త చీఫ్ హయాంలో వేటుపడ్డవారి గురించి కాంగ్రెస్‌లో చర్చ! కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎవరినైనా తిట్టేయొచ్చు. అది పార్టీ వేదికైనా.. పార్టీ ఆఫీసైనా..! రాహుల్, సోనియాగాంధీలను తప్పించి..…
టీఆర్ఎస్ నేతలకు ఎన్నికలు జరిగితేనే ప్రజలు గుర్తుకు వస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తేనే దళిత బంధు, ఇంద్రవెల్లి సభ ద్వారా పోడు భూముల సమస్య గుర్తుకు వచ్చిందంటూ ఆమె టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గడిచిన ఏడేళ్లుగా పోడు రైతులు పట్టాల కోసం పోరాటాలు చేస్తున్నారని ఆమె గుర్తుచేశారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వడంతో పాటు రైతు బంధు వర్తింపజేయాలని సీతక్క డిమాండ్ చేశారు. జనాలు రేవంత్…
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకులకు పార్టీలో కీలక పదవులు ఇచ్చే ఆలోచనలో పీసీసీ ఉన్నట్టు తెలుస్తుంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కొన్ని ప్రధానమైన అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణలో ఒక పార్టీ నుండి… ఇంకో పార్టీకి వలసలు సహజమయ్యాయి. అయితే, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారిని కూడా కలుపుకుని పోవాలని రేవంత్ భావిస్తున్నారు. దీంట్లో భాగంగా పార్టీలోకి నాయకులను ఆహ్వానించే పనిలో పడ్డారు. పార్టీలోకి ఎవరిని…