Off The Record: కాంగ్రెస్ హైకమాండ్ ఆశీస్సులతో తెలంగాణ క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్. చాలామంది ఆశావహులు క్యూలో ఉన్నా… అందర్నీ వెనక్కి నెట్టి ఏఐసీసీ కోటాలో నేరుగా మంత్రి అయ్యారాయన. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగినప్పుడే ఆయనకు మంత్రి పదవి దక్కింది. అయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండానే నేరుగా రేవంత్‌రెడ్డి కేబినెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు అజహర్. అంతవరకు బాగానే ఉన్నా… ఇప్పుడాయన పదవి విషయంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్న చర్చ…