తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు బిహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పాట్నాలో సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో సీఎం నితీష్, డిప్యూటీ సీఎం తేజస్వి స్వాగతం పలికారు. గాల్వాన్ అమర సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిచారు సీఎం. ఒక్కో కుటుంబానికి పదిలక్షల సహాయం అందజేశారు. బీహార్ సీఎం నితీష్‌తో కలిసి చెక్కులను తెలంగాణ సీఎం కేసీఆర్ అందించారు. అనంతరం సీఎం నితీశ్ కుమార్‌తో కలిసి భోజనం చేయనున్నారు. అనంతరం నితీష్ తో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు.…