కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసేతర ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవాళ ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ గోపాల్ యాదవ్‌తో సమావేశమయ్యారు.
సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఇవాళ సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్. రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. అయితే.. టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్ లో ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో నేరుగా కేసీఆర్ ఢిల్లీలో ఉంటూ బీజేపీపై యుద్ధం తీవ్రతరం చేయడంపై ఆయన ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో.. భాగంగా జాతీయ రాజకీయాలపై పలువురు సీనియర్ నేతలతో…
ఫెడరల్ ఫ్రంట్ కోసం అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్‌లో గులాబీ దళపతి కేసీఆర్ ఉన్నారా? పైకి చెప్పకపోయినా.. ఆ పనిలో పూర్తిస్థాయిలో పావులు కదుపుతున్నారా? గతంలో DMK.. తాజాగా లెఫ్ట్ పార్టీల అగ్రనేతలతో భేటీ తర్వాత కేసీఆర్ తదుపరి కార్యాచరణ ఏంటి? రెండేళ్ల ముందే జాతీయస్థాయి రాజకీయ పరిణామాలపై చర్చ2024 సార్వత్రిక ఎన్నికలకు జాతీయస్థాయిలో బీజేపీని బలంగా ఢీకొట్టే వారు ఎవరు? ప్రస్తుతం రాజకీయవర్గాల్లో దీనిపైనే చర్చ. ఎవరికి వారు బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుందని తెలుస్తోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభా సమావేశాల్లో పాల్గొన్న అనంతరం జరిగే బీఏసీ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఆదివారం రోజు నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనేందుకు సీఎం ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈ నెల 26న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు…
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమంతో పాటు తెలంగాణ స్వయం పాలనలో యువత పాత్ర గొప్పదని సీఎం అన్నారు. తెలంగాణ ఏర్పాటుతో రాజకీయ, పాలనా రంగాల్లో విద్యార్థి యువనేతలకు చట్టసభల్లో పెద్దఎత్తున అవకాశాలు కల్పించి బడుగు బలహీన వర్గాల యువతను ప్రోత్సహిస్తున్నామని సీఎం అన్నారు. ఈ ప్రక్రియ మునుముందు కూడా కొనసాగుతుందని తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని వారి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడే…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వరంగల్, యాదాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అత్యంత ఆధునిక వైద్య సేవలతో ఏర్పాటు చేయనున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్, ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన భవనాలను ప్రారంభించనున్నారు. నేడు వరంగల్ జిల్లా పర్యటన ముగించుకుని కేసీఆర్ యాదాద్రికి చేరుకుంటారు. ఇప్పటికే యాదాద్రి నూతన ఆలయ పునర్నిర్మాణాల పనులను…