Mohammad Azharuddin: తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌కి శాఖలు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. మైనార్టీ సంక్షేమంతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహమ్మద్ అజహరుద్దీన్ గత నెల 31న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేశారు.
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జులై 7న మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన రాజధానిలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ అధిష్ఠానం మరియు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యూరియా ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో సీఎం రేవంత్, కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలవనున్నారని సమాచారం. రాష్ట్రానికి కావలసిన ఎరువుల కోటాను…
నేడు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగింది. గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ తెలంగాణ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో తెలంగాణ మంత్రి వర్గం 15కు చేరింది. మంత్రి వర్గంలో మరో మూడు ఖాళీలు ఉన్నాయి. సామాజిక వర్గాల కూర్పుతో తెలంగాణ మంత్రి వర్గం రెడ్డి 4, ఎస్సీలు 4, బీసీలు 3, వెలమ 1, బ్రాహ్మణ 1,…
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ జాప్యానికి తెరపడింది. ఎట్టకేలకు కాంగ్రెస్ నాయకత్వం ముగ్గురిని కొత్త మంత్రులుగా ఎంపిక చేసింది. నేడు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగింది. గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ తెలంగాణ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. Also Read:Telangana…
CM Revanth Reddy : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై నేడు తుది నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. అదే విధంగా, ఇవాళ ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీతో సమావేశమై విస్తరణపై తుదిరూపురేఖలు ఖరారు చేసే అవకాశముంది. విస్తరణలో భాగంగా ఐదుగురు కొత్తవారికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అంశంపై పార్టీలో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. Maharashtra: మహారాష్ట్రలో…
అదిగో పులి అంటే..... ఇదిగో తోక అన్నట్టు తయారైంది తెలంగాణ కేబినెట్ విస్తరణ వ్యవహారం. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తం కుమార్‌రెడ్డి అలా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే... ఇలా కేబినెట్ విస్తరణ చర్చలు మొదలవుతాయి రాష్ట్రంలో. వాళ్ళు తిరిగి వచ్చేదాకా ఇంటా బయటా అవే మాటలు.
Uttam Kumar Reddy : తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆశావహుల జాబితాను కాంగ్రెస్ హైకమాండ్‌కు పంపినట్లు సమాచారం. హైకమాండ్ పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రత్యేకంగా కలుసుకుని మంత్రివర్గ విస్తరణపై అధికారికంగా సమాచారం అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 3వ తేదీన నలుగురు కొత్త మంత్రులు కేబినెట్‌లో చేరే అవకాశముందని తెలుస్తోంది. ఇక,…
కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఇవ్వాలని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో సగం జనాభా.. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా జనాభా ఉన్నారని తెలిపారు. సగం జనాభా ఉన్న చోట ఒక్క మంత్రి కూడా లేడన్నారు.
CM Rvanth Reddy : తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వాతావరణంలో కేబినెట్ విస్తరణ గురించి తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసిన తర్వాత, ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో బిజీగా ఉండడంతో కేబినెట్ విస్తరణ అంశం కొంతకాలం వెనక్కి పోయింది. అయితే, ఈ సమయంలో ఎవరైనా కేబినెట్ విస్తరణలో చోటు పొందేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ, ఈ విషయంపై ఇటీవల తాజా పర్యవేక్షణలు జోరుగా సాగుతున్నాయి.…
Telangana Cabinet: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాగా, 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను గులాబీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.