తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 12 నుంచి మొదలవబోతున్నాయి. దాంతో.... మాజీ సీఎం కేసీఆర్ సభకు వస్తారా? రారా అన్న చర్చ మరోసారి జరుగుతోంది రాజకీయవర్గాల్లో. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సభకు వస్తే ఆయన్ను టార్గెట్ చేసేందుకు రెడీగా ఉందట కాంగ్రెస్. ఆయన పదేళ్ళ పాలనను సభ సాక్షిగా ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కేసీఆర్ తన పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారంటూ...