తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి గల్లీ నుంచి డిల్లీ వరకు పోరాటం చేసి తెలంగాణ బాపూజీగా గుర్తింపు తెచ్చుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీపై బడుగు విజయ్ కుమార్ దర్శకత్వంలో చిరందాసు ధనుంజయ నిర్మించిన యూనిటీ డాక్యుమెంట్రీ ఫిల్మ్ ను ప్రఖ్యాత గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 27 కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని ప్రముఖ రచయిత మసన చెన్నప్ప తో కలిసి అశోక్ తేజ యూనిటీ డాక్యుమెంట్రీ ఫిల్మ్ ను విడుదల చేశారు.…