తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దు చేశారు. అయితే ఇవాళ శాసనసభ “భూ భారతి” బిల్లుపై చర్చతో ప్రారంభమైంది. ఆ తర్వాత రైతు బీమా పాలసీలపై లఘు చర్చ జరగనుంది. జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లులను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. మండలిలో రైతు బీమా పాలసీలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
Telangana Assembly Sessions Live: తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం అయ్యింది. తెలంగాణలో మూడోసారి కొలువు దీరిన ప్రభుత్వ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.