తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల కిందట విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కి అప్పుడే న్యాయపరమైన చిక్కులు మొదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందంటూ ఇద్దరు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయగా దానిపై ఇవాళ విచారణ జరగనుంది. మహిళా రిజర్వేషన్లను అమలుచేయటం వల్ల అనేక మంది పురుష అభ్యర్థులు నష్టపోనున్నారని రోహిత్ బాల, కృష్ణ అనే ఇద్దరు ఉద్యోగార్థులు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తమకు మెరిట్ ఉన్నప్పటికీ ఉద్యోగాలు పొందలేని…