lalu Prasad Yadav: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుటుంబ సభ్యులపై ఈడీ, సీబీఐ విచారణ జరుపుతోంది. ఆయన కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఈడీ లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లపై దాడులు చేసింది. ఈ రైడ్స్ లో విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బిహార్‌లో ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడుల తర్వాత ఆ రాష్ట ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. కేంద్రంలోని అధికార పక్షం తమకు ఆధిక్యత లేని రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలపై కేంద్ర ఏజెన్సీలను పంపుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీకి ముగ్గురు అల్లుళ్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ వాకౌట్ చేయడంతో మూజువాణి ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఏకగ్రీవంగా నెగ్గింది. విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మహాకూటమిలో భాగమైన వివిధ పార్టీల నుంచి మంగళవారం బిహార్ కేబినెట్‌లోకి మొత్తం 31 మంది మంత్రులుగా చేరారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని, కూటమి మిత్రపక్షమైన రాష్ట్రీయ జనతాదళ్‌కు అత్యధిక స్థానాలు రానున్నాయని పలు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఆర్జేడీకి 16 కేబినెట్ సీట్లు, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు 11మందికి చోటు దక్కే అవకాశం ఉంటుందని తెలిపాయి.
Prashant Kishor comments on bihar politics: బీహార్ రాష్ట్ర రాజకీయాలపై, నితీష్ కుమార్- ఆర్జేడీ కూటమి, 2024 ఎన్నికలకై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. నితీష్ కుమార్ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. బీహార్ రాజకీయాలలో ఇప్పడు స్థిరత్వం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2013-14 నుంచి బీహార్ లో ప్రభుత్వ ఏర్పాటు ఇది ఆరోసారి అని.. గత 10 ఏళ్ల నుంచి బీహార్ లో…
బిహార్ రాజకీయాల్లో మరోసారి కీలక మలుపు చోటుచేసుకుంది. బీజేపీకి రెండోసారి షాక్ ఇస్తూ ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చేసింది. ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో చేతులు కలిపింది. ఆ పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఏర్పాటు చేయనున్నారు.