Sikkim: సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న వాహనం గురువారం రాత్రి తీస్తా నదిలో పడిపోయింది. దాదాపుగా 1000 అడుగుల ఎత్తు నుంచి వాహనం పడిపోయినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా, 9 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో బీజేపీ లీడర్ ఇతి శ్రీ నాయక్ జెనా కూడా ఉన్నారు. వాహనం లాచెన్ నుంచి లాంచుంగ్ వెళ్తుండగా వాహనం మలుపు తిరిగే సమయంలో ప్రమాదం జరిగింది.
Sikkim Flood: సిక్కింలో మేఘాల విస్ఫోటనం కారణంగా తీస్తా నదిలో అకస్మాత్తుగా వరదలు రావడంతో మరణాల పరంపర కొనసాగుతోంది. మట్టి, శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్న పరిస్థితి నెలకొంది.
Sikkim: సిక్కిం రాష్ట్రానికి దెబ్బమీద దెబ్బ తగులుతూ ఉన్నాయి. వరదలతో రాష్ట్రం ఇప్పటికే అతలాకుతంల అవుతోంది. ఈ సమయంలోనే మరో విపత్తు పొంచి ఉంది. ఈ ప్రాంతంలో మరొక సరస్సు తెగిపోయే ప్రమాదం పొంచి ఉంది.
సిక్కింలో మేఘాలు విధ్వంసం సృష్టించాయి. మేఘాలు కమ్ముకోవడంతో తీస్తా నదిలో వరదలు పోటెత్తడంతో ఆ ప్రాంతం మొత్తం దెబ్బతింది. తీస్తా నదిలో అకస్మాత్తుగా వచ్చిన వరదలో 23 మంది సైనికులు కూడా గల్లంతయ్యారు.