గన్నవరం వచ్చిన ఇండిగో విమానం ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించింది. ల్యాండింగ్ అవుతున్న సమయంలో రన్ వే మీదకు వచ్చి.. మళ్లీ గాల్లోకి ఎగిరింది. దీంతో విమానం లోపల ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురైన ప్రయాణికులు.. బెంబెలెత్తిపోయారు. సరిగ్గా విమానం ల్యాండింగ్ సమయంలో వీల్ తెరుచుకోలేదు.
Data Not Received From SSLV D1: ఆదివారం నాడు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం సాంకేతికంగా విజయవంతం అయ్యింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగం ఉదయం 9:18 నిమిషాలకు జరిగింది. ఎస్‌ఎస్‌ఎల్వీ రాకెట్ ఈవీఎస్ 02, ఆజాదీ కా శాట్‌ను అనే రెండు ఉపగ్రహాలను క్షక్ష్యలోకి తీసుకెళ్లింది. అయితే ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం భౌతికంగా సక్సెస్ అయిందా? లేదా అన్నదానిపై ఉత్కంఠ వీడడం…
108 services not working due to technical probelem: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ సర్వీసులకు అంతరాయం కలిగింది. సర్వర్‌లో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఏపీలోని 108, ఇతర అత్యవసర సర్వీసెస్ ఫోన్ నెంబర్ తాత్కాలికంగా పనిచేడం లేదని 108, 104 సర్వీసెస్ అడిషనల్ సీఈవో ఆర్. మధుసూదన రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో మెడికల్ ఎమర్జెన్సీ కావాల్సిన వారు, వైద్య సాయం కోసం అంబులెన్స్ సర్వీస్ కావాలంటే 104(1) కి ఫోన్ చేయాలని ఏపీ…
హైదరాబాద్ నగరంలో మరోసారి మెట్రో రైళ్లు మొరాయించాయి. సాంకేతిక కారణాల వల్ల గురువారం రాత్రి మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో వెళ్లే మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలోని అసెంబ్లీ స్టేషన్‌లో సుమారు 20 నిమిషాలకు పైగా మెట్రో రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల తరచూ మెట్రో రైళ్లు సాంకేతిక కారణాలతో నిలిచిపోతున్నాయని.. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కాగా మెట్రో రైలు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలనే లక్ష్యంతో ఇటీవల…
ఏపీలోని గ్రామ సచివాలయాల్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్ లీలలు బయటపడుతున్నాయి. కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే ఏ సామాజిక వర్గం వారికైనా ఎస్టీ సర్టిఫికెట్ జారీ అవుతోంది. దీంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన షేక్ షబ్బీర్ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కోసం స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి ఆయన దరఖాస్తుకు ఆమోదం తెలిపారు. అయితే సదరు వ్యక్తి షేక్…