Amazon Layoffs: టెక్ ఇండస్ట్రీలో ఎవరి జాబులు ఎప్పుడు పోతాయో తెలియడం లేదు. ఉన్నట్లుండి ఐటీ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా, అమెజాన్ ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించింది. అయితే, కేవలం టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లు ప్రకటించం ఇప్పుడు సంచలనంగా మారింది.
Salesforce: ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు 2022 చివరి నుంచి తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. వరసగా పలు విడతల్లో ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటిస్తున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలా ప్రముఖ కంపెనీలు లేఆఫ్ జాబితాలో ఉన్నాయి.
Layoffs in the Indian tech industry: భారతీయ టెక్ పరిశ్రమల్లో కూడా లేఆఫ్స్ ఉండబోతున్నాయా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్, మెటా, యాపిల్, గూగుల్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ప్రపంచవ్యాప్తంగా ముంచుకొస్తున్న ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో తమ నష్టాలను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రభావం భారత కంపెనీలపై కూడా పడుతోంది.