రైతులు చేస్తున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు దేశ రాజధాని పోలీసులు భారీ ప్లాన్ కు సిద్ధం అయ్యారు. పంజాబీ రైతుల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సుమారు 30 వేల టియర్ గ్యాస్ షెల్స్‌ను ఆర్డర్ పెట్టినట్లు తెలుస్తుంది.
తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున అన్నదాతలు (Farmers Protest) దేశ రాజధాని ఢిల్లీకి (Delhi) కదం తొక్కారు. సరిహద్దుల్లోనే వారిని నిలువరించేందుకు భద్రతా బలగాలు మోహరించాయి.
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణ రాష్ట్రంలో పెద్దఎత్తున అల్లర్లకు కారణంగా మారింది. గత రెండు నెలలుగా మైయిటీ, కూకీ తెగల మధ్య ఘర్షణ రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది.