ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో జట్టు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని కొనియాడారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భారత జట్టు గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసం ప్రదర్శించిందని ప్రశంసించారు. మెగా టోర్నమెంట్ ఆసాంతం భారత జట్టు ప్రదర్శించిన అసాధారణమైన పోరాటాన్ని, పట్టుదలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి మ్యాచ్‌లోనూ మన క్రీడాకారిణులు చూపించిన పోరాట…